RRB NTPC 2025: ఆర్​ఆర్బీ ఎన్​టీపీసీ రిజల్ట్స్ అప్డేట్.. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

RRB NTPC 2025: ఆర్​ఆర్బీ ఎన్​టీపీసీ 2025 పరీక్షలు ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి తుది ఫలితాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

RRB NTPC 2025 Results to be released soon

ఆర్​ఆర్బీ ఎన్​టీపీసీ 2025 పరీక్షలు ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి తుది ఫలితాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అయితే సంబందించిన ఫలితాలను త్వరలో విడుదల చేయనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను ప్రాంతీయ ఆర్​ఆర్బీల అధికారిక వెబ్‌సైట్ల నుంచి తెలుసుకోవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అయితే, ఈ పరీక్షలకు సంబంధించి గతంలోనే బోర్డు ఆర్​ఆర్బీ ఎన్​టీపీసీ ఆన్సర్ కీ 2025ని విడుదల చేసింది. వాటిపై అభ్యంతరాలేమైనా ఉంటే జూలై 6, 2025 లోపు తెలియజేయాలని, అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.50, బ్యాంక్ సర్వీస్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ అభ్యంతరాలు సరైనవే అయితే బ్యాంక్ ఛార్జీలను మినహాయించి, చెల్లించిన రుసుమును అభ్యర్థికి తిరిగి చెల్లిస్తామని అధికారులు తెలిపారు.

ఆర్​ఆర్బీ ఎన్​టీపీసీ సీబీటీ 1 రిజల్ట్స్ వచ్చిన తరువాత అభ్యర్థులను సీబీటీ 2 కోసం షార్ట్‌లిస్ట్ చేస్తారు. దీని తరువాత తదుపరి నియామక దశలలో టైపింగ్ స్కిల్ టెస్ట్/కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (వర్తించినట్లుగా), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. వీటన్నిటిలో ఉత్తీర్ణత సాధించిన వారిని ఎంపిక చేస్తారు.

మీ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి:

  • అభ్యర్థులు ముందుగా ఆర్​ఆర్బీల అధికారిక వెబ్‌సైట్‌ https://www.rrbguwahati.gov.in/ లోకి వెళ్ళాలి
  • హోమ్ పేజీలో ఆర్​ఆర్బీ ఎన్​టీపీసీ సీబీటీ 1 ఫలితాలు 2025 డౌన్‌లోడ్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి
  • మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి
  • స్క్రీన్‌పై మీ ఫలితాలు కనిపిస్తాయి
  • ఫలితాన్ని డౌన్‌లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు