RRB NTPC Exam Date 2024
RRB NTPC Exam Date 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 2024కి సంబంధించిన ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్షా తేదీలను త్వరలో ప్రకటించనుంది. ఆర్ఆర్‌బీ అభ్యర్థులు పూర్తి షెడ్యూల్‌ని విడుదల చేసిన తర్వాత వారి సంబంధిత జోన్‌ల అధికారిక వెబ్‌సైట్‌లలో చెక్ చేయొచ్చు.
ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ రిక్రూట్‌మెంట్ తేదీలివే :
గ్రాడ్యుయేట్-లెవల్ ఖాళీల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 14న ప్రారంభమై అక్టోబర్ 13న ముగిసింది. అండర్ గ్రాడ్యుయేట్-స్థాయి స్థానాలకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది.
ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ 2024 : ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్యలో గ్రాడ్యుయేట్-స్థాయి పోస్టులు 8,113, అండర్ గ్రాడ్యుయేట్-స్థాయి పోస్టులు 3,445 ఉన్నాయి.
అర్హత ద్వారా ఖాళీల వివరాలివే :
గ్రాడ్యుయేట్-లెవల్ ఖాళీలు :
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ : 1,736 ఖాళీలు
స్టేషన్ మాస్టర్: 994 ఖాళీలు
గూడ్స్ రైలు మేనేజర్: 3,144 ఖాళీలు
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ : 1,507 ఖాళీలు
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 732 ఖాళీలు
అండర్ గ్రాడ్యుయేట్-స్థాయి ఖాళీలు :
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ : 2,022 ఖాళీలు
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : 361 ఖాళీలు
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : 990 ఖాళీలు
ట్రైన్స్ క్లర్క్ : 72 ఖాళీలు
Read Also : CBSE CTET Answer Key 2024 : సీబీఎస్ఈ సీటెట్ ఆన్సర్ కీ 2024 త్వరలో విడుదల.. డేట్, టైమ్ అప్‌టేట్ వివరాలివే!