RRB Recruitment: ఆర్ఆర్బీలో 368 ఉద్యోగాలు.. నెలకు రూ.35 వేల జీతం.. దరఖాస్తు, లాస్ట్ డేట్ వివరాలు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB Recruitment) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

RRB Recruitment: Notification soon for 368 Section Controller Jobs in RRB

RRB Recruitment: రైల్వేలో జాబ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB Recruitment) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్‌లలో ఖాళీగా ఉన్న 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో https://www.rrbapply.gov.in దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

SBI Clerk Posts: ఇవాళే లాస్ట్ డేట్.. ఎస్బీఐ క్లర్క్ పోస్టులకు అప్లై చేసుకున్నారా.. డైరెక్ట్ లింక్ తో వెంటనే అప్లై చేసుకోండి

వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 20 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 వరకు జీతం అందుతుంది.

అర్హత, ఎంపిక విధానం, పూర్తి వివరాలు:
ఈ పోస్టులకు సంబంధించి జోన్‌ల వారీగా ఖాళీలు, ఉద్యోగాలు, విద్యార్హతలు, పరీక్షా సరళి, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌ విడుదల చేస్తారు.