నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 6,238 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. టెన్త్ పూర్తయిన వారికీ అవకాశం.. ఏజ్ లిమిట్, అర్హతలు, జీతం..? ఫుల్ డీటెయిల్స్ ఇవే..

నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Railway jobs

RRB Technician Recruitment 2025: నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 6,238 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు rrbapply.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

 

పోస్టుల వివరాలు..
♦ మొత్తం పోస్టులు సంఖ్య : 6,238
♦ టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులు -183
♦ టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులు : 6,055
♦ అప్లికేషన్ : ఆన్ లైన్ ద్వారా
♦ అప్లికేషన్లు ప్రారంభం – జూన్ 28 నుంచి
♦ చివరి తేదీ : జులై 28వ తేదీ వరకు.
♦ అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, మైనార్టీలు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.250, ఇతర అభ్యర్థులకు రూ. 500.
♦ ప్రారంభ వేతనం: టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ కు రూ.29,200,  టెక్నీషియన్ గ్రేడ్-3 కు రూ.19,900 నుంచి ప్రారంభ వేతనం ఉంటుంది.

దరఖాస్తుదారులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో ఈ క్రింది పత్రాలను అప్‌లోడ్ చేయాలి:
♦ అర్హత కలిగిన అభ్యర్థులు rrbapply.gov.in ద్వారా అప్లికేషన్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
♦ ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, సంతకం యొక్క స్కాన్ చేసిన కాపీ.
♦ చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్ (ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, మొదలైనవి).
♦ విద్యా అర్హత సర్టిఫికెట్లు, కుల లేదా వర్గం సర్టిఫికెట్.
♦ నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లయితే, నివాస ధృవీకరణ పత్రం
♦ దరఖాస్తులను అధికారిక నియామక పోర్టల్ ద్వారా మాత్రమే సమర్పించాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులకు అనుమతి లేదు.

అర్హతలు, వయోపరిమితి..
టెక్నీషియన్ గ్రేడ్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇనుస్ట్రుమెంటేషన్, బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత ట్రేడులో మూడేండ్ల డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టుల కోసం 18 ఏళ్ల నుంచి 33ఏళ్ల వయస్సు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
టెక్నీషియన్ గ్రేడ్ -3 పోస్టులకు పదో తరగతి లేదా సమాన అర్హతతో పాటు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్ , మెకానిక్ మెకట్రానిక్స్, మెకానిక్ (డిజిల్), వెల్డర్, మెషినిస్ట్ ట్రేడుల్లో గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18ఏళ్ల నుంచి 33ఏళ్ల మధ్యలో ఉండాలి.

ఎంపిక విధానం :
రాత పరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అయితే, టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులకు వేరువేరుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది.

టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకు ఇలా..
♦ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ టెస్టు ఉంటుంది.
♦ ఎగ్జామ్ 90 నిమిషాల్లో పూర్తి చేయాలి.
♦ ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు.
♦ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 ప్రశ్నలు 15 మార్కులు.
♦ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 20 ప్రశ్నలు 20 మార్కులు.
♦ మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు 20 మార్కులు.
♦ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 25 ప్రశ్నలు 35 మార్కులకు ఉంటుంది.
♦ సీబీటీ ఎగ్జామ్ మల్టీపుల్ షిప్టుల్లో నిర్వహిస్తే నార్మలైజేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడతారు.
♦ సీబీటీలో అన్ రిజర్వుడు 40శాతం, ఈడబ్ల్యూఎస్ 40శాతం, ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) 30శాతం, ఎస్సీ 30శాతం, ఎస్టీ 25శాతం మార్కులు సాధించిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.

టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులకు ఇలా..
♦ మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ బేస్ట్ టెస్టు ఉంటుంది.
♦ ఎగ్జామ్ 90 నిమిషాల్లో పూర్తి చేయాలి.
♦ ప్రతితప్పుడు సమాధానంకు 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు.
♦ మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు 25 మార్కులు
♦ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు 25 మార్కులు.
♦ జనరల్ సైన్స్ 40 ప్రశ్నలు 40 మార్కులు.
♦ జనరల్ అవేర్నెస్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.
♦ సీబీటీ ఎగ్జామ్ మల్టీపుల్ షిఫ్టుల్లో నిర్వహిస్తే నార్మలైజేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడుతారు.
♦ సీబీటీలో అన్‌రిజర్వ్ 40 శాతం, ఈడబ్ల్యూఎస్ 40 శాతం, ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) 30 శాతం, ఎస్సీ 30 శాతం, ఎస్టీ 25 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.