రైల్వేలో ఉద్యోగం కోసం కలలు కంటున్నారా? అలాంటి లక్షలాది మంది యువతకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి గాను టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు జులై నెలల దీనికి సంబందించిన నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా 6,374 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేయనున్నారు?
విద్యార్హత:
టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్: ఫిజిక్స్ / కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ / IT / ఇన్‌స్ట్రుమెంటేషన్ సబ్జెక్టులలో B.Sc. డిగ్రీ లేదా సంబంధిత ట్రేడులలో 3 సంవత్సరాల ఇంజినీరింగ్ డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
టెక్నీషియన్ గ్రేడ్ 3: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో NCVT/SCVT గుర్తింపు పొందిన ITI సర్టిఫికెట్ లేదా 10వ తరగతి తర్వాత యాక్ట్ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన వారు కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి: గ్రేడ్ 1 సిగ్నల్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుండి 36 సంవత్సరాల మధ్యలో ఉండాలి. గ్రేడ్ 3 జాబ్స్ కోసం అప్లై చేసుకునే వారికి 18 నుండి 33 సంవత్సరాల వయసు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC ఇతర రిజర్వేషన్ ఉన్నవారికి సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కు హాజరు కావాల్సి ఉంటుంది. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం మెడికల్ టెస్ట్ చేసి ఎంపిక చేస్తారు.
జీతం వివరాలు: గ్రేడ్ 1 సిగ్నల్ జాబ్ కి ఎంపికైనవారికి రూ. 29,200 జీతంతో పాటు అలవెన్సులు అందుతాయి. గ్రేడ్ 3 జాబ్స్ సాధించిన వారికి రూ. 19,900 జీతం + అలవెన్సులు అందుతాయి.
సదర్న్ రైల్వే (SR) 1,215
ఈస్టర్న్ రైల్వే (ER) 1,119
వెస్టర్న్ రైల్వే (WR) 849
నార్తర్న్ రైల్వే (NR) 478
నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ సమయం వృధా చేయకండి. పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిలబస్ పై ఫోకస్ పెట్టండి. గత RRB టెక్నీషియన్ నోటిఫికేషన్ల సిలబస్‌ను పరిశీలించండి. దాదాపుగా ఈ పరీక్షల్లో కూడా అవే అంశాలు ఉంటాయి. ప్రాథమిక అంశాలను రివైజ్ చేయండి. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ టెక్నికల్ సబ్జెక్టులపై దృష్టి పెట్టండి. పాత ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేయండి. ఆన్‌లైన్ మాక్ టెస్టులు రాయండి.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.rrbcdg.gov.in/ ను సంప్రదించండి.