RRB Recruitment: గుడ్ న్యూస్.. ఆర్ఆర్బీ టెక్నీషియన్ దరఖాస్తు గడువు పొడగింపు.. వెంటనే అప్లై చేసుకోండి

RRB Recruitment: దరఖాస్తు గడువును పొడిగిస్తూ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 7న తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

RRB Technician Recruitment Application Deadline Extended

రైల్వే జాబ్స్ కి అప్లై చేసుకోవాలని అనుకుంటున్నవారికి గుడ్ న్యూస్. ఆర్ఆర్బీ ఇటీవల 6,238 టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా.. తాజాగా దరఖాస్తు గడువును పొడిగిస్తూ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 7న తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కాబట్టి, ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.rrbapply.gov.in దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఇలా చేసుకోండి:

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ www.rrbapply.gov.in లోకి వెళ్ళాలి
  • దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న ప్రాంతీయ RRBని సెలెక్ట్ చేసుకోవాలి
  • ప్రాథమిక వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి
  • దరఖాస్తు ఫారమ్ ఫిల్ చేసి అవసరమైన ధ్రువ పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • ఆగస్టు 9 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.