SAIL Recruitment: స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా ఇటీవల తమ సంస్థలో అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది విషయం తెలిసిందే. మొత్తం 816 అప్రెంటీస్ పోస్టులను ఈ నోటిఫికేష ద్వారా భర్తీ చేయనునుంది ఈ సంస్థ(SAIL Recruitment). దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా రేపటితో అంటే సెప్టెంబర్ 2తో గడువు ముగియనుంది. కాబట్టి, అర్హులైన అభ్యర్థులు వెంటనే అధికారిక పోర్టల్ sail.co.in నుండి అప్లై చేసుకోవాలని సంస్థ సూచించింది.
విద్యార్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అలాగే నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
ఇక తుది ఎంపిక, వేతన వివరాలకు సంబందించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో సూచించడం జరిగింది. అభ్యర్థులు నోటిఫికేషన్ నుంచి తదితర వివరాలను తెలుసుకోవచ్చు. ఇక రేపే అంటే సెప్టెంబర్ 2 లాస్ట్ డేట్ కాబట్టి దరకాస్తు చేసుకోగలరు.