SBI has released a notification for 6,589 Junior Associate posts.
బ్యాంకు ఉద్యోగాల కోసం చేస్తున్నవారికి గుడ్ న్యూస్. ఎస్‌బీఐలో 6,589 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సంస్థలో ఖాళీగా ఉన్న క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) భర్తీ చేయనుంది. దీనికి సంబందించిన అర్హత, పూర్తి వివరాలు కింద తెలుపడం జరిగింది. కాబట్టి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://sbi.co.in/web/personal-banking ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఈ పోస్టులకు సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 26తో గడువు ముగియనుంది.
విద్యార్హత:
అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే డిగ్రీ చివరి సంవత్సరం/సెమిస్టర్ విద్యార్థులు సైతం తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు ఏప్రిల్ 1, 2025 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లు మధ్యలో ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ వారికి 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 నుంచి 15 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌ఎస్, డీఎక్స్‌ఎస్ అభ్యర్థులకు మాత్రం ఎలాంటి రుసుము ఉండదు.
ఎంపిక ప్రక్రియ:
ఈ పోస్టులకు ఎంపిక మూడు విభాగాల్లో జరుగుతుంది. ముందుగా ప్రిలిమినరీ పరీక్ష, రెండవది మెయిన్స్ పరీక్ష, చివరిది స్థానిక భాషా పరీక్ష. వీటిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని ఎంపిక చేస్తారు.
వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,050 నుంచి రూ.64,480 వరకు జీతం అందుతుంది.