SBI PO Preliminary Result 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీ కోసం ఇటీవల ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులకు బిగ్ అప్ డేట్.
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఆగస్టు 2025 చివరి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ sbi.co.in నుండి తనిఖీ చేయవచ్చు, డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా 41 బ్యాక్‌లాగ్ పోస్టులతో సహా 541 ఖాళీల భర్తీ కోసం రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టు 2, 4, 5, తేదీల్లో జరిగాయి.(SBI PO Preliminary Result 2025)
SBI PO ఫలితం 2025.. ఇలా చెక్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్..
స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్ sbi.co.in కి వెళ్లండి
స్టెప్ 2: హోమ్‌పేజీలో “కెరీర్స్” పై క్లిక్ చేయండి
స్టెప్ 3: “రిక్రూట్‌మెంట్ రిజల్ట్స్” ఎంచుకోండి
స్టెప్ 4: SBI PO 2025 ఫలితాల లింక్‌ను తెరవండి
స్టెప్ 5: మీ రిజిస్ట్రేషన్/రోల్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 2025లో జరగనున్న మెయిన్స్ పరీక్షకు అర్హులు అవుతారు. మెయిన్స్ అడ్మిట్ కార్డ్ పరీక్షకు వారం ముందు విడుదల చేయబడుతుంది.
ఫలితాల ప్రకటనలు, నియామక ప్రక్రియ తదుపరి దశలకు సంబంధించిన అప్ డేట్స్ కోసం దరఖాస్తుదారులు SBI అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేస్తూ ఉండాలని సూచించారు.
SBI PO ఫలితం 2025: మర్చిపోయిన పాస్‌వర్డ్‌ను ఇలా తిరిగి పొందండి..
అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను అందించడం ద్వారా వారి SBI PO ఫలితం 2025ని చెక్ చేయగలరు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను మరచిపోయే అవకాశం ఉంది. మీ మర్చిపోయిన పాస్‌వర్డ్‌ను తిరిగి పొందడానికి ఇలా చేయండి..
అధికారిక వెబ్‌సైట్, sbi.co.inని సందర్శించండి
* హోమ్‌పేజీలో కెరీర్ బటన్‌పై క్లిక్ చేయండి
* SBI PO ఫలితం 2025పై క్లిక్ చేయండి
* “పాస్‌వర్డ్ మర్చిపోయారా?” బటన్‌పై క్లిక్ చేయండి
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ IDతో పాటు మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి
* సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. కొత్త పాస్‌వర్డ్ మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ కు పంపబడుతుంది.