తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురు చూడకుండా.. విద్యార్థులు జూన్‌లో జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజులు చెల్లించాలని విద్యాశాఖ సూచించింది.
ఫీజుల చెల్లింపులకు సమయం తక్కువగా ఉందని చెప్పింది. సబ్జెక్టుల వారీగా ఫీజులకు సంబంధించిన వివరాల గురించి విద్యాశాఖ ఇంకా ప్రకటన చేయలేదు.
ఈ తేదీల్లోగా సప్లిమెంటరీకి ఫీజులు కట్టాలి
కాగా, జీపీఏ ఈ సారి తొలగించడంతో సబ్జెక్టుల వారీగా మార్కుల గ్రేడ్లు ఇచ్చారు. ఉత్తీర్ణతకు కావాల్సిన మార్కులు వస్తే పాస్ అని మోమోపై ఉంటుంది. ఉత్తీర్ణత సాధించలేకపోతే ఫెయిల్ అని అందులో ఇచ్చారు. ఇంతకు ముందు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ విధానాన్ని పాటించిన విషయం తెలిసిందే.
టెన్త్ ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది కంటే 1.47 శాతం ఉత్తీర్ణత అధికంగా ఉంది. ప్రైవేటు స్కూళ్లలో 94.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని పాఠశాలలు రెండు ఉన్నాయి.