ఫైనల్ ఎగ్జామ్స్ : మార్చి 30 నుంచి

స్కూల్ పిల్లలకు ఫైనల్ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ వచ్చేసింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 8 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

  • Publish Date - January 20, 2019 / 04:05 AM IST

స్కూల్ పిల్లలకు ఫైనల్ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ వచ్చేసింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 8 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో స్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను ఎస్‌సీఈఆర్‌టీ శనివారం విడుదల చేసింది. 1-9వ తరగతి  వరకు చదువుతున్న విద్యార్థులకు మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 8 వరకు పరీక్షలుఫైనల్ ఎగ్జామ్స్ నిర్విహించనున్నారు.  1-5వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, 6-7వ తరగతి పరీక్షలు ఉదయం 10 నుంచి 12:45 వరకు; 8, 9వ తరగతుల పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 4:45 వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 10న ఫలితాలు విడుదలవుతాయి.  ఫిబ్రవరి 15 నుంచి 27 వరకు పదోతరగతి ప్రీఫైనల్‌ పరీక్షలు జరగనున్నాయి.