AP Tenth Exams Time Table: ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ కి సంబంధించి టైమ్ టేబుల్ వచ్చేసింది. పరీక్షల షెడ్యూల్ ను ఎస్‌ఎస్‌సీ బోర్డు రిలీజ్ చేసింది. 2026 మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. 16న ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటుంది. 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్ పరీక్షలు ఉంటాయి. 23న మ్యాథ్స్, 25న ఫిజిక్స్, 28న బయాలజీ, 30న సోషల్, 31న ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్-2) ఎగ్జామ్స్ ఉంటాయి.
ఇక, ఏప్రిల్ 1న ఓఎస్‌ఎస్‌సీ సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎగ్జామ్ టైమ్ టేబుల్ వచ్చేసింది కనుక విద్యార్థులు ప్రిపరేషన్ ను మరింత ముమ్మరం చేయాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచే సబ్జెక్టులపై పట్టు సాధిస్తే ఫైనల్ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
Also Read: రేషన్ కార్డులు లేని వారికి బిగ్ న్యూస్.. అలాగే కొత్తగా పెళ్లైన వారికి కూడా..