SSC JE Final Result 2025
SSC JE Final Result 2025 : జూనియర్ ఇంజనీర్ (JE) పరీక్ష తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రకటించింది. జూనియర్ సివిల్ ఇంజనీర్లు, జూనియర్ మెకానికల్ ఇంజనీర్లు, జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు నిర్వహించిన ఎస్ఎస్‌సీ జేఈ టైర్ 2 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (ssc.gov.in) నుంచి తమ ఫైనల్ రిజల్ట్స్ యాక్సెస్ చేయవచ్చు.
ఆపై డౌన్‌లోడ్ చేసుకోవచ్చు . అధికారిక నోటీసు ప్రకారం.. మొత్తం 1,701 మంది అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ నియామకం కోసం షార్ట్‌లిస్ట్ అయ్యారు. ఎస్ఎస్‌సీ జేఈ ఫైనల్ రిజల్ట్ 2025 పీడీఎఫ్ ఫార్మాట్‌లో ప్రకటించింది. ఇందులో రోల్ నంబర్, పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, కేటగిరీ, సెలెక్టెడ్ పోస్ట్, సెలెక్టెడ్ కేటగిరీ, ర్యాంక్ వంటి వివరాలు ఉంటాయి.
ఎస్ఎస్‌సీ జేఈ ఫైనల్ రిజల్ట్స్ 2025 డౌన్‌లోడ్ చేయాలంటే? :
“ఏ కారణం చేతనైనా తుది ఫలితంలో కటాఫ్ మార్కుల కన్నా ఎక్కువ స్కోర్ చేసిన అభ్యర్థి షార్ట్‌లిస్ట్ కాకపోతే ఫైనల్ రిజల్ట్స్ ప్రకటించినప్పటి నుంచి ఒక నెలలోపు కమిషన్ సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి రిపోర్టు చేయాలి” అని అధికారిక నోటీసు పేర్కొంది.
కనీస అర్హత మార్కులు (కటాఫ్) :
పేపర్-I, పేపర్-II రెండింటిలోనూ అభ్యర్థులు పొందిన (SSC JE) మార్కులను ఫైనల్ మెరిట్, కటాఫ్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి పేపర్‌కు కనీస అర్హత మార్కులు ఈ కింది విధంగా ఉన్నాయి.
నాన్ రిజర్వ్ అభ్యర్థులు : 30శాతం (పేపర్-I: 60, పేపర్-II: 90)
OBC/EWS అభ్యర్థులు : 25 శాతం (పేపర్-I: 50, పేపర్-II: 75)
అన్ని ఇతర కేటగిరీల అభ్యర్థులు : 20శాతం (పేపర్-I: 40, పేపర్-II: 60)
ఎస్ఎస్‌సీ జేఈ పేపర్-I రిజల్ట్స్ ఆగస్టు 20, 2024న ప్రకటించారు. ఆ తర్వాత పేపర్-II పరీక్ష నవంబర్ 6, 2024న జరిగింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. గతంలో జేఈ టైర్ 1 పరీక్ష జూన్ 5, 6, 7, 2024 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్ష భారత ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో జూనియర్ ఇంజనీర్ల (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) నియామకం కోసం నిర్వహిస్తారు.
Read Also : Gold Rates Today : బంగారం మళ్లీ షాకిచ్చిందిగా.. పసిడి ధరలు పైపైకి.. ఏకంగా రూ.85వేలు.. తులం లక్ష దాటేస్తుందా?
ఈ పరీక్ష కింద 950కి పైగా పోస్టులను నియమించనున్నారు. ఎస్ఎస్‌సీ జేఈ టైర్ 2 రిజల్ట్స్‌తో పాటు, కటాఫ్ మార్కులు కూడా ఉంటాయి. ఎస్ఎస్‌సీ జేఈ టైర్ 2 కోసం ప్రతి బ్రాంచ్‌కు అంటే.. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్‌కు ప్రత్యేక కటాఫ్‌లు విడుదల అవుతాయి. కటాఫ్ మార్కులతో కూడిన నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.