staff selection commission recruitment 2025
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2025 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://ssc.nic.in/ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జులై 21న ముగియనుంది.
దరఖాస్తుల సమర్పణ తేదీలు: జూన్ 30 నుంచి జులై 21 వరకు.
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు: జులై 22 వరకు ఉంటుంది
దరఖాస్తు ఫారమ్ సవరణ: ఆగస్టు 1 నుంచి 2 ఓపెన్ ఉంటుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-I): అక్టోబర్ 27 నుంచి 31 వరకు ఉండే అవకాశం ఉంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-II): జనవరి-ఫిబ్రవరి, 2026 లో ఉండే అవకాశం ఉంది.
దరఖాస్తులో ఎలాంటి ఇబ్బంది తలెత్తినా సంప్రదించాల్సిన టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్: 180 030 93063.
వయోపరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి వివిధ పోస్టులకు వేరువేరుగా ఉంటుంది.
దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ100. మహిళా అభ్యర్థులు,ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంటుంది.