SSC Recruitment 2022 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 1411 పోస్టుల భర్తీ

పరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్‌ టెస్టులతో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అభ్యర్ధుల వయసు జులై 1, 2022 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసు పరిమితిలో ఎస్సీ,ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల మినహాయింపు వర్తిస్తుంది.

Ssc Police Drivers Jobs

SSC Recruitment 2022 : దిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ స్ధాయిలో డ్రైవర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1411 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి ఓపెన్‌ 604, ఓబీసీ 353, ఈడబ్ల్యుఎస్‌ 142, ఎస్సీ 262, ఎస్టీ 50 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోపాటు హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్‌ టెస్టులతో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అభ్యర్ధుల వయసు జులై 1, 2022 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసు పరిమితిలో ఎస్సీ,ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల మినహాయింపు వర్తిస్తుంది. ఎంపిక విషయానికి వస్తే కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్యం, కొలతల పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లోసైతం పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్ లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పీఈ అండ్‌ ఎంటీ, ట్రేడ్‌ టెస్ట్‌లను దిల్లీలోనే నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 29జులై 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ssc.nic.in/ పరిశీలించగలరు.