SSC MTS Notification 2025 Released
నిరుద్యోగులకు శుభవార్త. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో స్థిరపడాలనుకునే వారికి అవకాశాన్ని కల్పించనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,908 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), హవల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 24, 2025 లోపు అధికారిక వెబ్ సైట్ ssc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం పదో తరగతి/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: MTS, హవల్దార్ (CBN) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. హవల్దార్ (CBIC) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST, OBC అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. పేపర్-1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), పేపర్-2 (డెస్క్రిప్టివ్) ఉంటుంది. హవల్దార్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు శారీరక దారుఢ్య పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.