×
Ad

SSC Notification: ఇంటర్ తోనే గవర్నమెంట్ జాబ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామ్ 2025 కోసం నోటిఫికేషన్​ని విడుదల చేసింది.

SSC Notification Released

ఇంటర్ పాసైనవారికి గుడ్ న్యూస్. మీకోసమే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామ్ 2025 కోసం నోటిఫికేషన్​ని విడుదల చేసింది. ఈ రిక్రూట్​మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 261 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ssc.gov.in అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి జూన్ 26 చివరి తేదీగా, ఫీజ్ చెల్లించడానికి చివరి తేదీ 27గా నిర్ణయించారు. దరఖాస్తుల్లో ఏదైనా సవరణల కోసం జులై 1, 2 తేదీలను నిర్ణయించారు.

అయితే సవరణ, సర్దుబాటులో కూడా కొంత రుసుమును వసూలు చేస్తున్నారు. తొలిసారి సవరణ చేయడానికి రూ.200, రెండోసారి సవరించిన చేయడానికి రూ.500 వసూలు చేస్తున్నారు. ఆన్లైన్ మెథడ్ లోనే ఈ ప్రెమెంట్స్ జరుగనున్నాయి.

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కటాఫ్ ఇయర్ 01.08.2025 గా నిర్ణయించారు.

దరకాస్తు రుసుము: దరఖాస్తు ఫీజ్ రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ లకు చెందిన మహిళా అభ్యర్థులకు ఎలాంటి రుసుము లేదు.

ఎంపిక విధానం: ఎస్​ఎఎస్సీ స్టెనోగ్రాఫర్​ గ్రేడ్​ సీ- డీ కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2025 ఆగస్టు 6 నుంచి 11 వరకు ఉంటుంది. ఈ పరీక్షలు 2 గంటల పాటు సాగుతాయి. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఎంపిక అయ్యే అవకాశం ఉంటుంది.