SSC SI Recruitment : డిగ్రీ అర్హతతో 1876 ఎస్ఐ పోస్టులు భర్తీ చేయనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్

విద్యార్హతల విషయానికి వస్తే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పొంది ఉండాలి. దిల్లీ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు మాత్రం అభ్యర్థులు కచ్చితంగా మోటార్‌ సైకిల్‌, కారుకు సంబంధించిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలన్న నిబంధ విధించారు. అభ్యర్థుల వయస్సు 20 ఏళ్లు నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి.

SSC Recruitment

SSC SI Recruitment : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్ధులకు శుభవార్త చెప్పింది. 1876 సబ్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Anand Mahindra : నా భార్య కోసం అలా పోజిచ్చా .. ఆగ్రాలో తన హనీమూన్‌లో ఫొటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

భర్తీ చేయనున్న పోస్టుల్లో దిల్లీ హోలీసు డిపార్ట్‌మెంట్‌ లో 106 పోస్టులు, బీఎస్‌ఎఫ్‌ 113 పోస్టులు, ఐటీబీపీ 63 పోస్టులు, ఎస్‌ఎస్‌బీ 90 పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు బిఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, దిల్లీ పోలీస్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబిపీ, ఎస్‌ఎస్‌బీల్లో పనిచేయాల్సి ఉంటుంది.

READ ALSO : viral video : పాములతో వ్యక్తి చలగాటం.. వణుకు పుట్టించిన వీడియో

విద్యార్హతల విషయానికి వస్తే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పొంది ఉండాలి. దిల్లీ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు మాత్రం అభ్యర్థులు కచ్చితంగా మోటార్‌ సైకిల్‌, కారుకు సంబంధించిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలన్న నిబంధ విధించారు. అభ్యర్థుల వయస్సు 20 ఏళ్లు నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి.

READ ALSO : Gutha Sukender Reddy : పార్టీ అవకాశం ఇస్తేనే అమిత్ పోటీ.. టికెట్ కోసం పైరవీలు, పాకులాడాడం చేయం : గుత్తా సుఖేందర్ రెడ్డి

ప్రభుత్వ నిబంధనల ప్రకారం,ఎస్సీ, ఎస్టీ అభ్యర్జులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు 3 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక విషయానికి వస్తే నాలుగు దశల్లో ఎంపిక పక్రియ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు స్వీకరణ 2023 జులై 22 ప్రారంభమై, ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 15 తో గడువు ముగుస్తుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ : www.ssc.nic.in పరిశీలించగలరు.