Tenth Exams
SSC Exams : తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల23 నుంచి ఉదయం గం.9-30 నుంచి మధ్యాహ్నం గం.12-45 వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,09,275 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరు కానున్నారు.
విద్యార్థుల హాల్‌టికెట్లను విద్యా శాఖ ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడంతో పాటు పాఠశాలలకు కూడా పంపించింది. కరోనా వల్ల విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలవడంతో సిలబస్‌ను 70 శాతానికి కుదించి ప్రశ్నపత్రాలను తయారు చేశామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు కుదించామని… జనరల్ సైన్స్ కేటగిరీలో మాత్రం ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ ప్రశ్నాపత్రాలను వేరుగా ఇవ్వనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈసారి ప్రశ్నపత్రంలో చాయిస్‌లను ఎక్కువగా ఇచ్చామని వివరించింది.