Admissions : తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్శిటీ పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశాలు

కోర్సు వివరాలకు సంబంధించి రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ , రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ , మూడు సంవత్సరాల డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ కోర్సలు ఉన్నాయి. అర్హతలకు సంబంధించి పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు అగ్రికల్చరల్‌ స్ట్రీమ్‌లో పాలీసెట్‌ 2022 పరీక్ష రాసి ఉండాలి.

Admissions : ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పాలిటెక్నిక్‌లలో మరియు విశ్వవిద్యాలయంచే గుర్తింపు పొందిన ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో సీట్ల భర్తీ చేపట్టారు. పాలిసెట్‌ 2022 మెరిట్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ప్రవేశం కోసం ఆన్‌లైన్‌లో ఆగస్టు 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో చదివిన విద్యార్థులకు 60శాతం సీట్లు కేటాయించనున్నారు. ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ఉంటుంది.

కోర్సు వివరాలకు సంబంధించి రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ , రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ , మూడు సంవత్సరాల డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ కోర్సలు ఉన్నాయి. అర్హతలకు సంబంధించి పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు అగ్రికల్చరల్‌ స్ట్రీమ్‌లో పాలీసెట్‌ 2022 పరీక్ష రాసి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 2022, డిసెంబర్‌ 31 నాటికి 15- 22 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది ఆగస్టు 13 , 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://diploma.pjtsau.ac.in పరిశీలించగలరు.

 

ట్రెండింగ్ వార్తలు