×
Ad

Telangana Common Entrance Exams: తెలంగాణలో కామన్ ఎంట్రన్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో మే 18వ తేదీన TG LAWCET ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇక మే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు TG PGECET ఎగ్జామ్ ఉంటుంది.

Representative Image (Image Credit To Original Source)

  • 2026-27 విద్యా సంవత్సరం CETs షెడ్యూల్‌ రిలీజ్
  • ICET, ECET, LAWCET పరీక్షల తేదీలు ఖరారు
  • మే 4 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్

Telangana Common Entrance Exams: తెలంగాణలో కామన్ ఎంట్రన్ ఎగ్జామ్స్ (ఉమ్మడి ప్రవేశ పరీక్షలు) షెడ్యూల్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మే 4 నుండి జూన్ 3 వరకు వివిధ వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. మే 4, 5, 10, 11 తేదీలలో TG EAPCET పరీక్షలు ఉంటాయి.

మే 12న బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన TG EDCET ఎగ్జామ్ జరగనుంది. మే 13, 14 తేదీలలో TG ICET (ఎంబీఏ, ఎంసీఏ) ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పాలిటెక్నిక్ పూర్తి చేసి నేరుగా ఇంజనీరింగ్ సెకండియర్ లో చేరాలనుకునే విద్యార్థుల కోసం మే 15న TG ECET పరీక్ష నిర్వహించనున్నారు. న్యాయ విద్యలో ప్రవేశాల కోసం మే 18వ తేదీన TG LAWCET ఎగ్జామ్ జరగనుంది.

ఇక ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే TG PGECET పరీక్షలు మే 28వ తేదీ నుంచి 31వ తేదీ నిర్వహించనున్నారు. ఇక చివరగా వ్యాయామ విద్య కోర్సుల కోసం నిర్వహించే TG PECET పరీక్షలు మే 31వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు జరగనునున్నాయి. ఆయా కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న విద్యార్థులు ఈ షెడ్యూల్ కు అనుగుణంగా ప్రిపరేషన్ అవ్వాల్సి ఉంటుంది.

Also Read: న్యూ ఇయర్ వేళ.. ఈ పనులు చేశారో అంతే సంగతి