TG CPGET 2025: టీజీ ‘సీపీగెట్’ ఎంట్రెన్స్ టెస్ట్ కు రంగం సిద్ధం.. 13న నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇలా తెలుసుకోండి

పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ పరీక్ష కోసం తెలంగాణ ఉన్నత విద్యా మండలి సర్వం సిద్ధం చేసింది. జూన్ 13వ తేదీన ఎంట్రెన్స్ పరీక్షల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

telangana cpget 2025

పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ పరీక్ష కోసం తెలంగాణ ఉన్నత విద్యా మండలి సర్వం సిద్ధం చేసింది. జూన్ 13వ తేదీన ఎంట్రెన్స్ పరీక్షల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ పరీక్షా ద్వారా ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర పీజీ కోర్సుల్లో విద్యార్థులు తమ చదువును అభ్యసించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ఉన్న పీజీ కాలేజీల్లో సీట్ల కోసం ఈ పరిక్ష జరుగనుంది. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలను త్వరలోనే విడుదల చేయనున్నారు.

దరఖాస్తుల స్వీకరణ తరువాత సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు ఉంటాయి. ఎంట్రెన్స్ ఎగ్జామ్ 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. పేపర్ పార్ట్-ఎలో 40 ప్రశ్నలు, పార్ట్ బిలో 60 ప్రశ్నలు ఉంటాయి. బయోటెక్నాలజీ పేపర్‌లో పార్ట్-ఎ 40 ప్రశ్నలు, పార్ట్-బిలో 60 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ర్యాకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.