Telangana EAPCET First Phase Seat Allotment Complete
తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ ఇప్పటికే మొదలయ్యింది. ఇందులో భాగంగానే శుక్రవారం(జులై 18) ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు అధికారులు. మొత్తం 77,561 మంది విద్యార్థులు సీట్లు సంపాదించగా 93.38 శాతం సీట్లు భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా సీట్లు పొందిన విద్యార్థులు జూలై 22 లోపు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కేటాయించిన సీటు రద్దవుతుంది. అయితే గతంలో లాగానే ఈసారి కేసుల బీటెక్ లో సీఎస్సీ కోర్సుకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ కోర్సులో మొత్తం 58,742 సీట్లు ఉండగా 57,042 సీట్లు భర్తీ అయ్యాయి. కేవలం 1700 సీట్లు మాత్రమే మిగిలాయని అధికారులు తెలిపారు.
సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ జూలై 25 నుంచి ప్రారంభమవుతుంది. జూలై 26న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 26 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక, జూలై 30 లోపు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది.