TG EAPCET 2025: టీజీ ఈఏపీసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్.. షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలిలు, పూర్తి వివరాలు
TG EAPCET 2025: టీజీ ఈఏపీసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు అధికారులు. దీనికి సంబందించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 5 నుంచి మొదలుకానుంది.
Telangana EAPSET Third Phase Counseling Schedule Released
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తవగా.. తాజాగా థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు అధికారులు. దీనికి సంబందించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 5 నుంచి మొదలుకానుంది. అర్హత పొందిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://tgeapcet.nic.in/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు, వివరాలు:
ఆగస్టు 5వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది
ఆగస్టు 6న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
ఆగస్టు 6 నుంచి 7వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు
ఆగస్టు 7వ తేదీన వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ఉంటుంది.
ఆగస్ట్ 10వ తేదీలోపు సీట్ల కేటాయింపు జరుగుతుంది.
ఆగస్ట్ 10 నుంచి 12వ తేదీ వరకు ట్యూషన్ ఫీజు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి.
ఆగస్టు 11 నుంచి 13 వరకు కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ చేసుకోవాలి.