Site icon 10TV Telugu

TG Ed.CET 2025: టీజీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ అప్డేట్.. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఇవాళే.. డైరెక్ట్ లింక్ తో మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

Telangana EdSET 2025 First Phase Seat Allotment Today

Telangana EdSET 2025 First Phase Seat Allotment Today

తెలంగాణాలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎడ్ సెట్ 2025 కౌన్సెలింగ్ కొనసాగుతోంది. అర్హత సాధించిన అభ్యర్థుల ర్యాంకులు, వారు ఎంచుకున్న వెబ్ ఆప్షన్ల ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు అధికారులు. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తవగా ఇవాళ(ఆగస్టు 11) అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరుగనుంది.

మీ అలాట్మెంట్ ఇలా చెక్ చేసుకోండి:

అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://edcetadm.tgche.ac.in/ లోకి వెళ్లాలి.

హోం పేజీలో సీట్ల అలాట్ మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

తరువాత మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై నొక్కాలి.

అక్కడ మీకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో డిస్ ప్లే అవుతుంది.

దానిని ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.

ఇక ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు వారికి కేటాయించిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవచ్చు. వీరికి ఆగస్టు 18వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. రిపోర్టింగ్ చేసుకోకపోతే సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈసారి ఎడ్‌సెట్‌ కోసం మొత్తం 38,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 32,106 మంది హాజరయ్యారు. వీరిలో 30,944 మంది అర్హత సాధించారు.

Exit mobile version