TG GPO Recruitment: తెలంగాణ జీపీవో రెండో విడత అర్హత పరీక్ష పూర్తి.. జులై 31 లోపు ఫలితాలు, పూర్తి వివరాలు

TG GPO Recruitment: తెలంగాణ గ్రామ పాలన అధికారుల నియామకాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబందించిన రెండో విడత అర్హత పరీక్షను విజయవంతంగా నిర్వహించారు అధికారులు.

Telangana GPO second phase eligibility test completed

తెలంగాణ గ్రామ పాలన అధికారుల నియామకాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబందించిన రెండో విడత అర్హత పరీక్షను విజయవంతంగా నిర్వహించారు అధికారులు. ఇటీవల జరిగిన ఈ పరీక్షకు మొత్తం 2,439 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కేవలం 1,734 మంది మాత్రమే హాజరయ్యారు. ఇక ఈ పరీక్షకు సంబందించిన ఫలితాలు జులై 31లోపు విడుదల చేసేందుకు సంబంధిత శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి దశలకు ఎంపిక చేస్తారు.

ఇక ఇప్పటికే జరిగిన తొలి విడత అర్హత పరీక్ష ద్వారా 3,454 మంది అభ్యర్థులను ఎంపికచేశారు అధికారులు. గ్రామాల్లో రెవెన్యూ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు గ్రామ స్థాయిలో అధికారులు అవసరం ఏర్పడింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఈ నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు త్వరలోనే ఆయా గ్రామాల్లో గ్రామ పాలన అధికారులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.