×
Ad

గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ.. ఇక్కడ చెక్‌ చేసుకోండి..

టీజీపీఎస్సీ 783 పోస్టులకుగానూ 782 పోస్టుల భర్తీకి జనరల్‌ ర్యాంకులు ప్రకటించింది.

Telangana Group 2 Final Result

TSPSC Group 2 results: తెలంగాణ గ్రూప్‌-2 తుది ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ 782 పోస్టుల భర్తీకి జనరల్‌ ర్యాంకులు ప్రకటించింది. www.tgpsc.gov.in లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.

విజయదశమిలోపే తుది ఫలితాలు ప్రకటించి, నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం చాలా రోజులుగా భావిస్తున్న విషయం తెలిసిందే.

Also Read: విజయ్ రోడ్ షోలో తొక్కిసలాట జరుగుతుందని ముందే చెప్పిన వ్యక్తి.. పాత వీడియో వైరల్..

783 పోస్టులతో 2022లో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ జారీ కాగా, 2024 డిసెంబరులో రాత పరీక్ష నిర్వహించారు. 2025 మార్చి 11న జనరల్‌ ర్యాంకుల జాబితా వచ్చింది. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. 18 రకాల గ్రూప్‌ 2 ఉద్యోగాలకు 783 మంది ఎంపికయ్యారు.

నోటిఫికేషన్‌లో ప్రకటించిన 783 పోస్టుల‌కుగానూ 782 పోస్టుల‌కు జ‌న‌ర‌ల్ ర్యాంకింగ్‌ ఇవాళ వచ్చింది. మిగతా ఒకదాన్ని విత్ హెల్డ్‌లో పెట్టారు.