Telangana High Court Jobs : తెలంగాణ హైకోర్టులో ఉద్యోగ ఖాళీల భర్తీ

టైపిస్ట్ పోస్టులు 43కాగా, కాపీయిస్ట్ పోస్టులు 42 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండిలి. కామర్స్ లేదా సైన్స్ లేదా ఆర్ట్స్, లేదా లా లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా తత్సమాన కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి.

Telangana High Court Jobs : తెలంగాణ హైకోర్టులో పలు ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 85 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులు ఉన్నాయి. టైపిస్ట్ పోస్టులు 43కాగా, కాపీయిస్ట్ పోస్టులు 42 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండిలి. కామర్స్ లేదా సైన్స్ లేదా ఆర్ట్స్, లేదా లా లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా తత్సమాన కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటుతెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్‌ హయ్యర్ గ్రేడ్ పాస్ కావాలి. కంప్యూటర్ ఆపరేట్ చేయగలిగే క్వాలిఫికేషన్ ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఆన్‌లైన్ బేస్డ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అక్కడ పరీక్ష రాయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 25న రాత పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తుకు చివరి తేదిగా ఆగస్టు 24, 2022ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://tshc.gov.in/పరిశీలించగలరు.

 

ట్రెండింగ్ వార్తలు