Telangana ICET 2025 Results
ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు జూలై 7వ విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రవి ఓ అధికారిక ప్రకటన చేశారు. జులై 7 మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ఫలితాలు అందుబాటులోకి వస్తాయని, అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ icet.tgche.ac.in ద్వారా ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు సూచించారు.