Inter Results 2025: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి..

ఈ పరీక్షలకు 9.5 లక్షల మందికిపైగా హాజరయ్యారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల అవుతున్నాయి. ఫస్ట్ ఇయర్‌తో పాటు సెకండియర్‌ పరీక్షల ఫలితాలను కూడా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నారు.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈ ఫలితాలను రిలీజ్ చేస్తారని ఇప్పటికే ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈ ప్రోగ్రాంలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా పాల్గొంటారు. ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు 9.5 లక్షల మందికిపైగా హాజరయ్యారు. 10tv.in/telangana-intermediate-results-2025, tgbie.cgg.gov.inలో ఇంటర్‌ ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.

ఇలా చెక్‌ చేసుకోండి
10tv.in/telangana-intermediate-results-2025 ఓపెన్ చేయండి
ఓ పేజీ ఓపెన్ అవుతుంది
ఫస్ట్ ఇయర్‌ లేదా సెకండ్‌ ఇయర్ ట్యాబ్‌పై క్లిక్‌ చేయండి
మీ హాల్‌ టికెట్‌ ఎంటర్‌ చేయండి
ఫలితాలు వస్తాయి.. ప్రింట్ తీసుకోండి

ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఇలా
tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయండి
ఫస్ట్ ఇయర్‌ లేదా సెకండ్‌ ఇయర్ ట్యాబ్‌పై క్లిక్‌ చేయండి
మీ హాల్‌ టికెట్‌ ఎంటర్‌ చేయండి
ఫలితాలు వస్తాయి.. ప్రింట్ తీసుకోండి

 

TG Inter 1st, 2nd Year Results 2025