SSC Public Exams 2026: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2026ను మార్చి 16న ప్రారంభించే అవకాశం ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ పలు వెర్షన్‌లలో పరీక్ష టైమ్‌టేబుల్ సిద్ధం చేస్తుండడం వల్ల అధికారిక తేదీలు ప్రకటించడంలో ఆలస్యం జరుగుతోంది.
ఈ సంవత్సరం ప్రభుత్వం కొత్త విధానాన్ని పరిశీలిస్తోంది. ప్రతి పరీక్ష మధ్య ఒక లేదా రెండు రోజుల విరామం ఇవ్వడం, సీబీఎస్ఈ విధానంలా నిర్వహించడం వంటివాటిని పరిశీలిస్తోంది. ఇది గత సంవత్సరాలతో పోల్చితే పెద్ద మార్పే. ఎందుకంటే అప్పట్లో పలు పరీక్షలు వరుసగా జరిగేవి. (SSC Public Exams 2026)
Also Read: Naga Chaitanya: నిజాయితీగా ఉండాలి.. అప్పుడే జనాలు ఇష్టపడతారు .. నాగ చైతన్య పోస్ట్ వైరల్
నిపుణుల సూచనలు, విద్యార్థుల స్ట్రెస్ విశ్లేషణ ఆధారంగా పరీక్షల మధ్య విరామం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవ్వడానికి సహాయపడుతుందని ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ భావిస్తోంది.
పరీక్ష షెడ్యూల్‌ను కొంచెం పొడిగించడం వల్ల విద్యార్థుల ఆందోళన తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రతి సబ్జెక్ట్‌కు రివిజన్‌కు సమయం దొరికేలా చేస్తుందని చెబుతున్నారు.
మరోవైపు, ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభం అవుతాయి. మార్చి13న ఇంటర్ మెయిన్ సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయి. ఆ తర్వాత రెండు రోజుల విరామం ఇచ్చి మార్చి16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభించాలని అధికారులు ప్రణాళికలు వేసుకున్నారు.
అదే నెలలో ఉగాదితో పాటు శ్రీరామనవవి, రంజాన్, మహావీర్ జయంతి వంటి పండుగలు వస్తున్నాయి. దీంతో ఆ సమయాల్లో సెలవులు ఇస్తే విద్యార్థులు చదువుకునేందుకు వీలుంటుందన ఆ మేరకు పరీక్షల టైమ్ టేబుల్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.