Naga Chaitanya: నిజాయితీగా ఉండాలి.. అప్పుడే జనాలు ఇష్టపడతారు .. నాగ చైతన్య పోస్ట్ వైరల్

అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya).. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్సీల లేని నటుడు. కేవలం సినిమాలు, షూటింగ్స్ తప్పా పెద్దగా బయట ఎక్కడ కనిపించడు ఈ హీరో. చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తాడు.

Naga Chaitanya: నిజాయితీగా ఉండాలి.. అప్పుడే జనాలు ఇష్టపడతారు .. నాగ చైతన్య పోస్ట్ వైరల్

Naga Chaitanya special post about the Dhootha web series

Updated On : December 2, 2025 / 7:14 AM IST

Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య.. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్సీల లేని నటుడు. కేవలం సినిమాలు, షూటింగ్స్ తప్పా పెద్దగా బయట ఎక్కడ కనిపించడు ఈ హీరో. చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తాడు. ఆయన స్పీచ్ లు కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. తోపు తురుము అంటూ ప్రగల్బాలు చెప్పే నటుడు కాదు నాగ చైతన్య. ఆయనలో తన ఫ్యాన్స్ కి నచ్చేది కూడా అదే. ఇక సినిమాల విషయంలో కూడా అంతే సింపుల్ గా ఉంటారు ఆయన. విజయాలను, పరాజయాలను ఒకేలాగా తీసుకుంటాడు. ఇక ఆయన గత చిత్రం తండేల్ ఎంత పెద్ద విజయం సాధించింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టింది.

Naga Vamsi: వచ్చే ఏడాది నెలకో సినిమా.. సమాధానం కూడా అదే.. నాగ వంశీ కౌంటర్ కామెంట్స్..

ఇదిలా ఉంటే, నాగ చైతన్య(Naga Chaitanya) కెరీర్ లో స్పెషల్ అంటే దూత సిరీస్ అనే చెప్పాలి. దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ఒక రేంజ్ లో హిట్ అయ్యింది. ఎపిసోడ్ ఎపిసోడ్ కి అదిరిపోయే ట్విస్టులు ఇస్తూ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేశాడు దర్శకుడు. ఈ సిరీస్ లో నాగ చైతన్య నటన కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. అయితే, ఈ సిరీస్ విడుదలై రెండేళ్లు గడుస్తున్న వేళ నాగ చైతన్య ఆసక్తికర పోస్ట్ చేశాడు. “నటుడిగా ఒక సృజనాత్మకమైన కథను సెలెక్ట్ చేసుకొని, దానికి తగ్గట్టుగా నిజాయతీగా పని చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ ‘దూత’ సిరీస్‌. అందుకే దూత సిరీస్ లో భాగమైన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో నాగ చైతన్య చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన వృషకర్మ అనే సినిమా చేస్తున్నాడు. పీరియాడికల్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కుస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదలైన స్పెషల్ వీడియోకి ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. నాగ చైతన్య కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. కాబట్టి, తండేల్ తరువాత మరోసారి వంద కోట్ల సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు నాగ చైతన్య.