TS Municipal Jobs : తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి కామర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయస్సు 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

Telangana Municipal Administration & Urban Development Department Job Vacancies
TS Municipal Jobs : తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీ చేపట్టనున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా టీఎస్‌పీఎస్సీ 78 పోస్టులకు భర్తీచేయనుంది. వీటిలో అకౌంట్స్ ఆఫీసర్-01, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-13, సీనియర్ అకౌంటెంట్-64 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి కామర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయస్సు 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.320. ఇందులో రూ.200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు కింద, రూ.80 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి
ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం విషయానికి వస్తే ఆన్‌లైన్ రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 11ఫిబ్రవరి 2023గా నిర్ణయించారు. అర్హత సాధించిన వారికి నెలకు ఏవో పోస్టులకు రూ.45,960 నుంచి రూ.1,24,150 వరకు చెల్లిస్తారు. జేఏవో పోస్టులకు నెలకు రూ.42,300 నుంచి రూ.1,15,270 వరకు చెల్లిస్తారు. ఎస్‌ఏ పోస్టులకు నెలకు రూ.32,810ల నుంచి రూ.96,890 వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; tspsc.gov.in/ పరిశీలించగలరు.