తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఫైనల్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరిగినట్టు అధికారులు ప్రకటించారు. సీట్లు పొందిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://tgpolycet.nic.in/cand_signin.aspx కాలేజీ వివరాలను తెలుసుకోవచ్చు. సీట్లు పొందిన వారు జులై 28, 29 తేదీల్లో ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కేటాయించిన కాలేజీల్లో జులై 28 నుంచి 30 మధ్యలో డైరెక్ట్ రిపోర్టింగ్ చేసుకోవాలి లేదంటే సీటు క్యాన్సిల్ అవుతుంది. జులై 31 నుంచి క్లాస్ వర్క్ మొదలవుతుంది.
మీ అలాట్‌మెంట్ ఆర్డర్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://tgpolycet.nic.in/Default.aspx లోకి వెళ్లాలి.
- హోం పేజీలో క్యాండెట్ లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే మీ అలాట్ మెంట్ కాపీ డిస్ ప్లే అవుతుంది.
- దానిని ప్రింట్ లేదా సేవ్ చేసుకోవాలి.