TG POLYCET 2025: టీజీ పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. స్లాట్ బుకింగ్స్, ముఖ్యమైన తేదీలు.. పూర్తి వివరాలు
TG POLYCET 2025: తెలంగాణ పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది. జులై 23వ తేదీ నుంచి ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది.

TG POLYCET 2025 Second phase counselling
తెలంగాణ పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది. జులై 23వ తేదీ నుంచి ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తిచేశారు అధికారులు. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జులై 23వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
టీజీ పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్, ముఖ్యమైన తేదీలు:
- జులై 23 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్స్
- జులై 24వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన
- జులై 24 నుంచి 25 జులై వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు
- జులై 25వ తేదీన ఫ్రీజింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
- జులై 28వ తేదీ లోపు ప్రొవిజినల్ సీట్ల కేటాయిపు ఉంటుంది
- జులై 28 నుంచి 29 వరకు సెల్ఫ్ రిపొర్టింగ్ చేసుకోవాలి
- జులై 28 నుంచి 30 వరకు కాలేజీలో రిపోర్టింగ్
- జులై 28వ తేదీ నుంచి ఓరియంటేషన్
- జులై 31వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం
టీజీ పాలిసెట్ ఫస్ట్ ఫేజ్ లో మొత్తం 65.5 శాతం సీట్లు భర్తీ అవ్వగా ప్రభుత్వ కాలేజీల్లో 82 శాతం సీట్లు.. ప్రైవేట్ కాలేజీల్లో 50 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది పాలిసెట్ పరీక్షకు 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 80,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.