TS POLYCET Counselling: తెలంగాణ పాలీసెట్ కౌన్సిలింగ్ ఇవాల్టి నుండే.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు మీకోసం

తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఇవాళ్టి(జూన్ 24) నుంచి మొదలుకానుంది. జూన్ 28 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది.

TS Polycet 2025 Counselling

తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఇవాళ్టి(జూన్ 24) నుంచి మొదలుకానుంది. జూన్ 28 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 2 విడతల్లో ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు అధికారులు. ఈ మేరకు సాంకేతి విద్యాశాఖ షెడ్యూల్ ను కూడా ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 80,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరందరికీ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా సీట్ల కేటాయింపు జరుగనుంది. ఈ ఏడాది నుంచి కొత్తగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 2, మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం నుంచి ఒక ప్రభుత్వ కాలేజీలు అందుబాటులోకి వచ్చింది.

ముఖ్యమైన తేదీలు:

జూన్ 26 నుంచి 29 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.

జూలై 1వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది.

జులై 4వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.

జూలై 4 నుంచి 6 వరకు వెబ్‌సైట్‌ ద్వారా ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోకపోతే సీటు రద్దవుతుంది.

జూలై 9 నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్:

తెలంగాణ పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ జూలై 9 నుంచి మొదలుకానుంది.

జూలై 11 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.

జూలై 11 నుంచి 12 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ఉంటుంది.

జూలై 15వ తేదీన సీట్లు కేటాయింపు జరుగుతుంది.

జూలై 18 నుంచి మొదటి సంవత్సరం తరగతులు మొదలవుతాయి.