TG EAPSET 2025 final phase counselling has begun.
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్ల భర్తీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు ఫేజ్ లలో సీట్ల కేటాయింపు పూర్తి అవగా ఆగస్టు 5 నుంచి అంటే ఇవాళ్టి నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షురూ కానుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://tgeapcet.nic.in/ ద్వారా ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
తెలంగాణ రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో ఉన్న మొత్తం సీట్లు 91,495. వాటిలో ఇప్పటివరకు 83,521 సీట్లు కేటాయించబడ్డాయి. అంటే దాదాపు 91.2 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.