తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ పరీక్షల అర్హత పొందిన అభ్యర్థులు బీటెక్ సెకండ్ ఇయర్ , బీఫార్మసీ సెకండ్ ఇయర్ లో అడ్మిషన్లు పొందనున్నారు. కౌన్సెలింగ్ ఆధారంగా అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు. బుధవారం విడుదల చేశారు.
టీజీ ఈసెట్ 2025 కౌన్సెలింగ్ కి సంబందించిన ముఖ్యమైన వివరాలు:
తెలంగాణ ఈసెట్ -2025 కౌన్సెలింగ్ జూన్ 14 నుంచి ప్రారంభంకానుంది. మొత్తం రెండు ఫేజ్ లలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. అందుకోసం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
తొలి విడత కౌన్సెలింగ్ కోసం జూన్ 14 నుంచి 18 వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
జూన్ 17 నుంచి 19 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది.
జూన్ 17 నుంచి 21 వరకు వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది.
జూన్ 25వ తేదీన ఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.
విద్యార్థులు జూన్ 29వ లోపు రిపోర్టింగ్ చేసుకోవాలి.
ఫైనల్ ఫేజ్ వివరాలు:
ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం జూలై 11 నుంచి 13 వరకు స్లాట్ బుక్ చేసుకోవాలి.
జూలై 14న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.
జులై 14 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది.
జూలై 15న వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ఉంటుంది.
జూలై 18వ తేదీలోపు సీట్ల కేటాయింపు ప్రక్రియ.
జులై 18 నుంచి 20 మధ్యలో సెల్ఫ్ రిపోర్టింగ్.
జూలై 19 నుంచి 22 మధ్యలో సీటు పొందిన కాలేజీలో రిపోర్టింగ్.
జూలై 23వ తేదీలోపు విద్యార్థులు అడ్మిషన్లు పొందాలి. లేకపోతే సీటు క్యాన్సిల్ అవుతుంది.