ఎగ్జామ్ టైం : 10th క్లాస్ టైం టేబుల్

  • Publish Date - December 4, 2019 / 02:02 AM IST

పరీక్షల టైం వచ్చేసింది. పదో తరగతి వార్షిక పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. 2020, మార్చి 19వ తేదీ నుంచి పరీక్షలను ప్రారంభించేలా ప్రభుత్వ పరీక్షల విభాగం టైం టేబుల్ ఖరారు చేసింది. రెగ్యులర్, ప్రైవేటు, ఒకేషనల్, ఓఎస్ఎస్‌సీ విద్యార్థులకు ఈ టైం టేబుల్ వర్తిస్తుందని తెలిపింది. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30గంటలకు ప్రారంభమై…మధ్యాహ్నం 12.15 గంటల వరకు కొనసాగుతాయని వెల్లడించింది. ద్వితీయ భాష పరీక్ష, ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1, పేపర్ -2 పరీక్షలు మాత్రం ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఉంటాయని అధికారులు వెల్లడించారు. కాంపోజిట్ కోర్సు ప్రథమ భాష పేపర్ – 2 పరీక్ష 10.45 గంటల వరకు, ఎస్ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు పరీక్ష 11.30 గంటల వరకు కొనసాగుతాయి. విద్యార్థులకు పరీక్షలో ఆఖరి అరగంట ముందు ఆబ్జేక్టివ్ పేపర్ ఇస్తారు. 

> 19-03-2020 ప్రథమ భాష పేపర్ – 1, ప్రథమ భాష పేపర్ -1 (కాంపోజిట్ కోర్సు)
>
20-03-2020 ప్రథమ భాష పేపర్ – 2, ప్రథమ భాష పేపర్ -2 (కాంపోజిట్ కోర్సు)
>
21-03-2020 ద్వితీయ భాష 
>
23-03-2020 ఇంగ్లీష్ పేపర్ 1 
>
24-03-2020 ఇంగ్లీష్ పేపర్ 2
>
26-03-2020 మ్యాథమెటిక్స్ పేపర్ 1
>
27-03-2020 మ్యాథమెటిక్స్ పేపర్ 2
>
28-03-2020 జనరల్ సైన్స్ పేపర్  1
>
30-03-2020 జనరల్ సైన్స్ పేపర్  2
>
31-03-2020 సోషల్ స్టడీస్ పేపర్ 1
>
01-04-2020 సోషల్ స్టడీస్ పేపర్ 2
>
03-04-2020 ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 
           లాంగ్వేజ్ పేపర్  1
>
04-04-2020 ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2
>
06-04-2020 ఎస్ఎస్‌సీ ఒకేషనల్ థియరీ

ట్రెండింగ్ వార్తలు