NSU Jobs : తిరుపతి ఎన్ఎస్ యూలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ
అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది 25 జనవరి 2023గా నిర్ణయించారు.

NSU Jobs :
NSU Jobs : ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయంలో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ తదిర ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధులను ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు పీజుగా 800 చెల్లించాల్సి ఉంటుంది.
అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది 25 జనవరి 2023గా నిర్ణయించారు. ఆఫ్ లైన్ దరఖాస్తులను పంపాల్సిన చిరునామా ; రిజిస్ట్రార్, ఎన్ ఎస్ యూ, తిరుపతి 517507 చిరునామాకు పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; nsktu.ac.in పరిశీలించగలరు.