Today is the last date for SSC CGL 2025 Registration
SSC CGL 2025 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో (జూలై 4) ముగియనుంది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2025 కోసం అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈ మేరకు చెల్లింపులు జరిపేందుకు చివరితేదీ జులై 5గా నిర్ణయించారు. ఇక దరఖాస్తుల్లో మార్పులు ఉంటే సరిచేసుకోవడం అవసరమైన సేవలు జూలై 9న మొదలై జూలై 11తో ముగియనున్నాయి. ఇక SSC CGL టైర్ 1 పరీక్ష ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30 వరకు జరుగనున్నాయి. SSC CGL పరీక్ష అనేది కమిషన్ యొక్క ప్రధాన పరీక్ష. ఇది గ్రూప్ B గెజిటెడ్, గ్రూప్ B నాన్-గెజిటెడ్, గ్రూప్ C పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తారు.
ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://ssc.gov.in/ లోకి వెళ్ళాలి.
హోమ్ పేజీలో లాగిన్ లింక్ పై క్లిక్ చేయాలి.
అక్కడ పేరు, పూర్తి వివరాలను ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఆ తర్వాత అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
అక్కడ అప్లికేషన్ ఫామ్ నింపి ఫీజు చెల్లించాలి.
తరువాత సబ్మిట్పై పై క్లిక్ చేసి చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.100. ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ కు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.