తెలంగాణ రాష్ట్రంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం సీపీగెట్ – 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తవగా ప్రస్తుతం ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు అధికారులు. రూ. 2 వేల ఫైన్ తో అప్లయ్ చేసుకునే ఈ అవకాశం కూడా జూలై 28తో అంటే ఇవాళ్టితో ముగియనుంది. కాబట్టి, అభ్యర్తులు వెంటనే అధికారిక వెబ్ సైట్ https://cpget.tgche.ac.in/ లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.
టీజీ సీపీగెట్ 2025 పరీక్ష వివరాలు:
టీజీ సీపీగెట్ ప్రవేశ పరీక్షలు ఆగస్టు 4వ తేదీ నుంచి ఆగస్టు 11 వరకు జరుగనున్నాయి. ప్రతీ రోజు మూడు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 45 సబ్జెక్టులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరగనుండగా సబ్జెక్టుల వారీగా తేదీలను తెలుసుకోవడం కోసం https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ ను సందర్శించండి. ఇక తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్‌టీయూహెచ్, మహిళా యూనివర్సిటీల పరిధిలో ఉన్న పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం సీపీగెట్ – 2025 నిర్వహిస్తారు.