Today is the last date to apply for Intelligence Bureau Jobs.
కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఇటీవల నోటిఫికేష విడుదల చేసింది. సంస్థలో ఉన్న ఖాళీగా మొత్తం 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికి సంబదించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా నేడు(ఆగస్టు 17) ముగియనుంది. కానీ, ఆన్లైన్ లో అప్లికేషన్ ఫీజ్ ను చెల్లించేందుకు మాత్రం ఆగస్టు 19వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. కాబట్టి, ఆసక్తి గల అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ mha.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత:
కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఇటీవల నోటిఫికేష విడుదల చేసింది. సంస్థలో ఉన్న ఖాళీగా మొత్తం 4,987 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్ లేదా సమానమైన విద్యార్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
ఎంపిక విధానం:
మూడు విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టైర్ 1, 2, 3 పరీక్షలు ఉంటాయి. వాటితోపాటు మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌తో ఎంపిక ప్రక్రియను కూడా నిర్వహిస్తారు.
వేతనం వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి 69,100 వరకు జీతం అందుతుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.