Tomorrow is the last date for SSC CHSL 2025 exam registration.
ఇంటర్ పాసైనవారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న వివిధ శాఖల్లో 3131 ఉద్యోగాలను (గ్రూప్ సీ ఉద్యోగాలు) భర్తీ చేయనుంది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా జులై 18తో గడువు ముగియనుంది. ఇంకా ఒకే రోజు గడువు ఉండటంతో ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://ssc.gov.in/login ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) పరీక్ష కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3131 గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనుంది. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జేఎస్‌ఏ), ట్రైబ్యునళ్లలో లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్డీసీ), డేటా ఎంట్రీ ఆపరేటర్(డీఈవో) లాంటి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది.
ఈ పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించినవారు వారు అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ స్కూల్‌లో చదివిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాత్రం కొన్ని శాఖల కోసం ఇంటర్‌లోని సైన్స్ గ్రూప్‌తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరిగా సుంచించారు. మరిన్ని వివరాల కోసం https://ssc.gov.in/api/attachment/uploads/masterData/NoticeBoards/Notice_of_adv_chsl_2025.pdf ఈ లింక్ పై క్లిక్ చేయండి.