ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు వచ్చేశాయి. సెకండియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా 93 శాతం ఉత్తీర్ణత శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. అనకాపల్లితో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా 73 శాతం ఉత్తీర్ణత శాతంతో చివరి స్థానంలో ఉంది. ఫస్టియర్ ఫలితాల్లోనూ కృష్ణా జిల్లా 85 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో ఉంది. చివరి స్థానంలో చిత్తూరు (54 శాతం) నిలిచింది.