TS EAMCET 2021 : ఎంసెట్ దరఖాస్తు గడువు పెంపు: జూన్ 10వరకు అప్లయ్ చేసుకోవచ్చు..

తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు అధికారులు.

TS EAMCET 2021 Application Last date : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అనేక పరీక్షలు వాయిదా పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు అధికారులు. విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసం చెల్లించాల్సిన అవసరం లేకుండా జూన్ 10 వరకు ఎంసెట్ దరఖాస్తుకు అప్లయ్ చేసుకోవచ్చు.

షెడ్యూల్ ప్రకారం.. ఎంసెట్ దరఖాస్తు గడువు జూన్ 3తో ముగిసింది. కరోనా పరిస్థితుల్లో ఎంసెట్ దరఖాస్తు గడువు తేదీని మరోసారి పొడిగించినట్టు ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. జూలై 5 నుంచి 9 వరకు కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ ఎంసెట్ పరీక్ష కోసం eamcet.tsche.ac.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. మరోవైపు ఎంసైట్ పరీక్షను వాయిదా వేసే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్ పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు