TS EdCET-2023 : టీఎస్ ఎడ్ సెట్-2023 దరఖాస్తు గడువు పొడిగింపు

అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తమకు దగ్గర్లోని పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు.

TS EdCET-2023

TS EdCET-2023 : తెలంగాణలో బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్ సెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. దరఖాస్తు గడువును మరో ఐదు రోజులపాటు పొడిగించారు. వాస్తవానికి టీఎస్ ఎడ్ సెట్-2023 దరఖాస్తు గడువు శుక్రవారం(ఏప్రిల్21)వ తేదీతో ముగిసింది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువును ఏప్రిల్ 25వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎడ్ సెట్ కన్వీనర్ ప్రొ. ఏ.రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు.

అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తమకు దగ్గర్లోని పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. జనరల్, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 30న దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.

Common Entrance Tests: మే 7న తెలంగాణ ఎంసెట్… 18న ఎడ్ సెట్.. ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

మే5న నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎడ్ సెట్ ను మే 18న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహిస్తారు. ఎడ్ సెట్ ను గతంలో ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించింది. ఈ ఏడాది నల్గొండలోని మహాత్మగాంధీ యూనివర్సిటీ నిర్విహించనుంది.