గిరిజ‌న గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 04:04 PM IST
గిరిజ‌న గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు

తెలంగాణ గిరిజ‌న సంక్షేమ గురుకుల విద్యాల‌యాల సంస్థ ఆధ్వ‌ర్యంలో నడిచే ప్ర‌తిభ క‌ళాశాల‌ల్లో 2019-20 అకడమిక్ ఇయర్‌కి గాను ఇంటర్ ఫస్టియర్‌లో ప్ర‌వేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మార్చిలో 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిజ‌న బాల‌బాలిక‌లు మాత్ర‌మే దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు ఇంటర్ ప్రవేశాలు కల్పిస్తారు.

* జనవరి 21 దరఖాస్తుకు చివరి తేదీ
* ఫిబ్రవరి 10న లెవల్-1, మార్చి 10న లెవల్-2 పరీక్షలు
* మార్చి 24న ఫలితాల వెల్లడి
* జూన్ 1 నుంచి తరగతులు

గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ (ఐఐటీ/ ఎన్ఐటీ). నీట్ పరీక్షకు ఉచిత శిక్ష‌ణ

అర్హ‌త‌: 2019 మార్చిలో 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసే విద్యార్థులు

ద‌ర‌ఖాస్తు : ఆన్‌లైన్

ఎంపిక‌ : ఎంట్రన్స్ టెస్ట్

నోటిఫికేషన్ విడుదల – 2018 డిసెంబర్ 28
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరి తేదీ – 2019 జనవరి 21
ప్రవేశ పరీక్ష (లెవల్-1) – 2019 ఫిబ్రవరి 10
మెరిట్‌లిస్ట్ (లెవల్-1) – 2019 ఫిబ్రవరి 28
ప్రవేశ పరీక్ష (లెవల్-2) – 2019 మార్చి 10
ఫలితాలు – 2019 మార్చి 24
తరగతులు ప్రారంభం – 2019 జూన్    01

నోటిఫికేషన్ : http://tgtwgurukulam.telangana.gov.in/COE-SOE-IIT%20Notification%202019-20.pdf

ఆన్‌లైన్ అప్లికేషన్ : http://kishoremamilla-001-site8.itempurl.com/

వెబ్‌సైట్ : http://tgtwgurukulam.telangana.gov.in/