హైదరాబాద్ : గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 14 నుండి 20 వరకు రాతపరీక్షలు జరుగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి పరిధిలో 229 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని బోర్డు పేర్కొంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు …మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు 20 వేల 263 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఎగ్జామ్స్ సెంటర్స్‌కు గంట ముందుగానే అభ్యర్థులు చేరుకోవాల్సి ఉంటుందని బోర్డు సూచించింది.
– ఫిబ్రవరి 14వ తేదీన తెలుగు, ఇంగ్లీష్, గణితం, బాటనీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, కామర్స్, హిస్టరీ సబ్జెక్టుల్లో పరీక్ష ఉండనుంది.
– ఫిబ్రవరి 15న స్టాటిస్ టిక్స్, మైక్రోబయాలజీ, పొలిటికల్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ర్టేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల్లో డీఎల్ పోస్టులకు రాత పరీక్ష ఉంటుంది.
– ఫిబ్రవరి 16వ తేదీన జేఎల్ అభ్యర్థులకు పెడగోగి సబ్జెక్ట్ పరీక్ష ఉంటుంది.
– ఫిబ్రవరి 17వ తేదీన జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ డీఎల్, జేఎల్ అభ్యర్థులకు ఉంటుంది.
– ఫిబ్రవరి 18న గణితం, బాటనీ, హిస్టరీ, ఎకనామిక్స్, ఉర్దూ, తెలుగు, కామర్స్‌సబ్జెక్టులకు ఎగ్జామ్ ఉండనుంది.
– ఫిబ్రవరి 19న ఫిజిక్స్, జువాలజీ, సివిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులకు…
– ఫిబ్రవరి 20న కెమిస్ట్రీ సబ్జెక్టులో జేఎల్ పోస్టులకు రాతపరీక్ష ఉండనుంది.
– 281 జేఎల్, 466 డీఎల్ పోస్టులున్నాయి.