TS TET 2024 Admit Card
TS TET 2024 Admit Card : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 కోసం తెలంగాణ పాఠశాల విద్యా శాఖ అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు తమ టీజీ టెట్ 2024-II లేదా టీఎస్ టెట్ అడ్మిట్ కార్డ్ 2024ను అధికారిక వెబ్‌సైట్ (tgtet2024, aptonline.in) నుంచి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టీఎస్ టెట్ హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ చేయాలంటే? :
Read Also : CBSE CTET Answer Key 2024 : సీబీఎస్ఈ సీటెట్ ఆన్సర్ కీ 2024 త్వరలో విడుదల.. డేట్, టైమ్ అప్‌టేట్ వివరాలివే!
టీఎస్ టెట్ అడ్మిట్ కార్డ్ 2024.. డైరెక్ట్ లింక్ ఇదిగో :
టీఎస్ టెట్ 2025 పరీక్ష జనవరి 2 నుంచి జనవరి 20, 2025 వరకు రెండు షిఫ్టులలో నిర్వహించనున్నారు. ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు నిర్వహించనున్నారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం 60శాతం స్కోర్ చేయాల్సి ఉంటుంది.
అయితే, బీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50శాతం స్కోర్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు, ఉత్తీర్ణత 40శాతం. గతంలో టీఎస్ టెట్ సర్టిఫికేషన్ ఏడేళ్లపాటు చెల్లుబాటు కాగా, ఇప్పుడు లైఫ్ టైమ్ చెల్లుబాటు అవుతుంది. టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో టెట్ స్కోర్‌లను ఉపయోగించవచ్చు. అదనంగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం టెట్ నిర్వహిస్తుందని ప్రకటించింది.
Read Also : 2025 Apple Products : 2025 ప్రారంభంలో రాబోయే కొత్త 5 ఆపిల్ ప్రొడక్టులు ఇవే.. పూర్తి వివరాలు మీకోసం..!